తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమం.! తీవ్రమైన గుండెపోటు.!
- January 28, 2023
నందమూరి హీరో తారకరత్నకు తీవ్రమైన గుండెపోటు వచ్చినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన గుండెలోని ఎడమవైపు కవాటం 90 శాతం బ్లాక్ అయినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయనను ఎక్మోపై వుంచినట్లు తెలుస్తోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాద యాత్రలో తారక రత్న అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే. స్పృహ కోల్పోయిన తారకరత్నను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. దాదాపు 45 నిముషాల పాటు పల్స్ అందలేదనీ తెలిసింది. ఆ తర్వాత గుండె కొట్టుకోవడం మొదలైంది. ప్రస్తుతం ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోందనీ వైద్యులు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
నందమూరి కుటుంబం నుంచి హీరోగా తొలి షాట్‌తోనే సెన్సేషనల్ క్రియేట్ చేసిన హీరో తారకరత్న. వస్తూ వస్తూనే సింగిల్ డేలో ఏకంగా తొమ్మిది సినిమాలను ప్రారంభించి రికార్డు సృష్టించాడు.
అయితే, ఆ తర్వాత కెరీర్ నత్తనడకనే సాగింది తారకరత్నకు. ఒకానొక టైమ్‌లో పూర్తిగా సినిమాలకు దూరమైన తారకరత్న ఈ మధ్యనే మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయ్యాడు. అలాగే, పొలిటికల్‌గానూ హుషారుగా కనిపిస్తున్నాడు. ఇంతలోనే ఇలా జరగడం ఫ్యాన్స్‌ని కలవరపాటుకు గురి చేస్తోంది.
తాజా వార్తలు
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!
- యూఏఈ-భారత్ మధ్య విమాన ఛార్జీలు తగ్గుతాయా?
- సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్‌లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు







