ఇరాన్ లో భారీ భూకంపం.. ఏడుగురి మృతి..

- January 29, 2023 , by Maagulf
ఇరాన్ లో భారీ భూకంపం.. ఏడుగురి మృతి..

టెహ్రాన్: ఇరాన్ లో భారీ భూకంపం సంభ‌వించి, పలు ప్రాంతాల్లో భ‌వ‌నాలు కుప్ప‌కూలాయి. ఏడుగురు మృతి చెంద‌గా, మ‌రో 440 మందికి గాయాల‌య్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 5.9గా న‌మోదైంద‌ని అధికారులు చెప్పారు.

భూకంపంతో ఖోయ్, అజ‌ర్ బైజాన్ ప్రావిన్స్ లో భ‌వ‌నాలు కూలిపోయాయ‌ని అన్నారు. ఆయా ప్రాంతాల్లో స‌హాయ‌క బృందాలు క్ష‌త‌గాత్రుల‌ను కాపాడి, ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నాయి. ఆసుప‌త్రుల‌కు స‌మాచారం అందించి, ముంద‌స్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాల‌ని చెప్పామ‌ని ఇరాన్ అత్య‌వ‌స‌ర సేవ‌ల విభాగ అధికారులు మీడియాకు తెలిపారు.

భూకంపం సంభ‌వించిన ప్రాంతాల్లో బాధితులు ఆర్త‌నాదాలు చేస్తుండ‌డం క‌ల‌చివేస్తోంది. ఆయా ప్రాంతాల్లో పొగ‌మంచు కూడా అధికంగా ఉంద‌ని, విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిచిపోయింద‌ని అధికారులు చెప్పారు. గాయాల‌పాలైన వారికి ప్ర‌థ‌మ చికిత్స అందించి, అంబులెన్సుల ద్వారా ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నామ‌ని వివ‌రించారు. ప్ర‌భుత్వం అత్య‌వ‌స‌ర సేవా విభాగాల‌న్నింటినీ అప్ర‌మ‌త్తం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com