ఫార్ములా E టైటిల్ స్పాన్సర్‌గా గ్రీన్కో
- January 29, 2023
హైదరాబాద్: హైదరాబాద్ మరో మెగా ఈవెంట్ కి వేదిక కాబోతోంది.ఫిబ్రవరి 11న జరగనున్న ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్ షిప్ 2023 కోసం హైదరాబాద్ అమితాసక్తితో ఎదురుచూస్తోంది.ఫార్ములా E టైటిల్ స్పాన్సర్‌గా గ్రీన్కో సంస్థ వ్యవహరిస్తోంది.రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో జరగనున్న ఈ ఈవెంట్ కోసం... ఫార్ములా రేసు ప్రేమికులే కాకుండా... టాలీవుడ్ సినీ స్టార్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ..ట్వీట్లు చేస్తున్నారు.ఇందు కోసం ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్ ని ప్రశంసిస్తున్నారు.మరో 20 రోజుల్లో హుస్సేన్ సాగర తీరంలో మొదలయ్యే ఫార్ములా రేస్ కోసం తామూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పేర్కొంటున్నారు.
గ్రీన్కో గ్రూప్ మరియు ఏస్ గ్రూప్ వ్యవస్థాపకుడు అనిల్ చలమలశెట్టి మాట్లాడుతూ, ఒక ఐకానిక్ రేస్‌తో భాగస్వామ్యం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది.ప్రపంచంలోని గ్రీన్ సిటీల్లో ఒకటి గ్రీన్ రేస్‌కు ఆతిథ్యం ఇవ్వనుందని నేను సంతోషిస్తున్నాను.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







