ఫార్ములా E టైటిల్ స్పాన్సర్‌గా గ్రీన్కో

- January 29, 2023 , by Maagulf
ఫార్ములా E టైటిల్ స్పాన్సర్‌గా గ్రీన్కో

హైదరాబాద్: హైదరాబాద్ మరో మెగా ఈవెంట్ కి వేదిక కాబోతోంది.ఫిబ్రవరి 11న జరగనున్న ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్ షిప్ 2023 కోసం హైదరాబాద్ అమితాసక్తితో ఎదురుచూస్తోంది.ఫార్ములా E టైటిల్ స్పాన్సర్‌గా గ్రీన్కో సంస్థ వ్యవహరిస్తోంది.రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో జరగనున్న ఈ ఈవెంట్ కోసం... ఫార్ములా రేసు ప్రేమికులే కాకుండా... టాలీవుడ్ సినీ స్టార్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ..ట్వీట్లు చేస్తున్నారు.ఇందు కోసం ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్ ని ప్రశంసిస్తున్నారు.మరో 20 రోజుల్లో హుస్సేన్ సాగర తీరంలో మొదలయ్యే ఫార్ములా రేస్ కోసం తామూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పేర్కొంటున్నారు.

గ్రీన్‌కో గ్రూప్ మరియు ఏస్ గ్రూప్ వ్యవస్థాపకుడు అనిల్ చలమలశెట్టి మాట్లాడుతూ, ఒక ఐకానిక్ రేస్‌తో భాగస్వామ్యం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది.ప్రపంచంలోని గ్రీన్ సిటీల్లో ఒకటి గ్రీన్ రేస్‌కు ఆతిథ్యం ఇవ్వనుందని నేను సంతోషిస్తున్నాను.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com