ఫార్ములా E 2023 ఫైనల్‌కు హాజరైన క్రౌన్ ప్రిన్స్

- January 29, 2023 , by Maagulf
ఫార్ములా E 2023 ఫైనల్‌కు హాజరైన క్రౌన్ ప్రిన్స్

రియాద్ : సౌదీ చారిత్రాత్మక రాజధాని దిరియా నడిబొడ్డున శనివారం జరిగిన ఫార్ములా ఇ రేస్ 2023 ఫైనల్‌కు క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ హాజరయ్యారు. క్రీడా మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్-ఫైసల్, పలువురు అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఫైనల్‌కు ముందు సౌదీ జాతీయ గీతం ఆలపించారు. క్రౌన్ ప్రిన్స్ ఫార్ములా ఇ దిరియాలో పాల్గొన్న జనాలను, జట్ల సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. సౌదీ అరేబియాలో ఫార్ములా E జరగడం ఇది 5వ సారి కావడం గమనార్హం. ఈసారి మొత్తం 11 జట్లు తరఫున 22 మంది డ్రైవర్లు "CORE Diriyah E-Prix 2023" పేరుతో రేసులో పాల్గొంటున్నారు. ఫార్ములా E 2023 రేస్ 2.495 కి.మీ పొడవు, 21 మలుపులు కలిగిన సర్క్యూట్‌లో నిర్వహిస్తున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com