90కి పెరిగిన మజ్లిస్ అషురా సభ్యుల సంఖ్య
- January 29, 2023
మస్కట్ : మజ్లిస్ అషురాలో ప్రతినిధుల సంఖ్య నాలుగు నుండి 90కి పెరిగింది. పదవ సారి మజ్లిస్ అషురాలోని విలాయత్‌ల ప్రతినిధుల సంఖ్యను పేర్కొంటూ మంత్రివర్గ నిర్ణయం (నం 19/2023)ను అంతర్గత వ్యవహారాల మంత్రి HE సయ్యద్ హమూద్ బిన్ ఫైసల్ అల్ బుసైదీ జారీ చేశారు. మజ్లిస్‌లో పదవ టర్మ్‌లో 90 మంది ప్రతినిధులు ఉంటారని , తొమ్మిదోసారి 86 మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. బిడ్‌బిడ్, ఇబ్రా విలాయత్‌లలో ప్రతినిధుల సంఖ్య ఒకటి నుండి ఇద్దరికి పెరిగిందని, జబల్ అఖ్దర్, సినావ్ విలాయత్‌లకు కొత్త సభ్యులను జోడించినట్లు తెలిపారు. ఇదిలావుండగా మజ్లిస్ అషురా అభ్యర్థిత్వానికి దరఖాస్తుల సమర్పణ గడువు జనవరి 29 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీతో ముగుస్తుందని హెచ్‌ఈ సయ్యద్ హమూద్ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు. సభ్యత్వం కోసం పోటీ చేయాలనుకునే పౌరులు తమ దరఖాస్తులను ఎన్నికల వెబ్‌సైట్ (elections.om) ద్వారా సమర్పించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







