2023లో మొదటి ఓపెన్ హౌస్‌ను నిర్వహించిన ఇండియన్ ఎంబసీ

- January 29, 2023 , by Maagulf
2023లో మొదటి ఓపెన్ హౌస్‌ను నిర్వహించిన ఇండియన్ ఎంబసీ

బహ్రెయిన్: భారత రాయబార కార్యాలయం 2023లో మొదటి ఓపెన్ హౌస్‌ను శుక్రవారం నిర్వహించింది. ఈ సందర్భంగా అంబాసిడర్ పీయూష్ శ్రీవాస్తవ 40 మంది భారతీయ కమ్యూనిటీ సభ్యులను కలుసుకున్నారు.ఈ సందర్భంగా వారి అత్యవసర, సాధారణ కాన్సులర్, ఉద్యోగ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు. అలాగే భారత 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగురవేత కార్యక్రమం, రిసెప్షన్‌లో భారతీయ కమ్యూనిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు రాయబారి ధన్యవాదాలు తెలిపారు. ICRF, వరల్డ్ NRI కౌన్సిల్, భారతి అసోసియేషన్, TKS, BKS, ఇండియన్ క్లబ్, బుదయ్య గురుద్వారా, TASCA అందించిన సహకారానికి రాయబారి కృతజ్ఞతలు తెలిపారు. ఎంబసీ, ICRF సంయుక్తంగా జైళ్లు, లేబర్ క్యాంపులలో వైద్య శిబిరాలను నిర్వహించాయని పేర్కొన్నారు. అలాగే తమకు మద్దుతుగా నిలిచిన లోకల్ గవర్నమెంట్ అథారిటీలకు ఈ సందర్భంగా అంబాసిడర్ పీయూష్ శ్రీవాస్తవ ధన్యవాదాలు తెలియజేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com