షార్జాలో 15 ట్రాఫిక్ ప్రమాదాలు, 29 వేల అత్యవసర కాల్స్
- January 30, 2023
యూఏఈ: భారీ వర్షాల నేపథ్యంలో షార్జా పోలీస్ సెంట్రల్ ఆపరేషన్స్‌కు గత ఐదు రోజుల్లో 999, 901 నంబర్లకు మంగళవారం నుండి శనివారం వరకు 29 వేల కంటే ఎక్కువ కాల్లు వచ్చాయని, అదే సమయంలో 15 ట్రాఫిక్ ప్రమాదాలు జరిగినట్లు ట్రాఫిక్, పెట్రోల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు చోటు చేసుకోలేదని తెలిపింది. 999 అత్యవసర నంబర్ కు 27,147 కాల్ రాగా, 901 నంబరుకు 2808 కాల్ల వచ్చాయని, వాటన్నింటి సిబ్బంది పరిష్కరించారని ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ జాసిమ్ బిన్ హద్దా అల్ సువైదీ తెలిపారు. ఆపరేషన్స్ రూమ్‌లోని సిబ్బంది అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూతో సహా అనేక భాషలలో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రింట్, ఆడియో, మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు అల్ సువైదీ తెలిపారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







