బహ్రెయిన్‌లో SMEలపై 348% పెరిగిన సైబర్ అటాక్స్
- January 30, 2023
బహ్రెయిన్: ఎవరైనా ఆన్లైన్లో ఉచిత బహుమతులు లేదా ఇతర ప్రోత్సాహకాలను ఆఫర్ చేసినప్పడు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాలని, ఇది మిమ్మల్ని తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక నష్టాల్లోకి నెట్టవచ్చని రాజ్యంలోని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద సందేశాలు లేదా ఫోన్ కాల్ల పట్ల అప్రమత్తంగా ఉండటమే ఏకైక మార్గం అని సూచిస్తున్నారు. గతేడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య బహ్రెయిన్‌లోని చిన్న వ్యాపారాలపై సైబర్ అటాక్లలో 348% పెరుగుదల నమోదైందని పరిశోధనా సంస్థ కాస్పెర్స్కీ వెల్లడించింది. 2022 ప్రథమార్థంలో ప్రపంచవ్యాప్తంగా 236.1 మిలియన్ల సైబర్ దాడులు జరిగాయని యూకే ఆధారిత AAG IT సర్వీసెస్ నివేదిక పేర్కొంది. NGN ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు,సీఈఓ యాకూబ్ అలవాది మాట్లాడుతూ.. సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలకు ప్రసిద్ధి చెందిన బహ్రెయిన్ కూడా సైబర్ అటాక్ ల నుంచి తప్పించుకోలేదని పేర్కొన్నారు. మోసపూరిత సందేశాలు, అనుమానిత లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అటువంటి లింక్‌లను ఎప్పుడూ ట్యాప్ చేయవద్దని సూచించారు.
తాజా వార్తలు
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్‌లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్‌షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్







