హిట్టు లిస్టులో ‘పఠాన్’.! మొత్తానికి బాలీవుడ్‌ని గట్టెక్కించేసిన ‘బాద్‌షా’.!
- January 30, 2023
రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘పఠాన్’ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షక జనం. ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా ‘పఠాన్’కి మంచి రెస్పాన్సే వస్తోంది. రిలీజ్‌కి ముందు నానా రకాల వివాదాల్లో ఇరుక్కున్నప్పటికీ ‘పఠాన్’ రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
కలెక్షన్లు బాగున్నాయ్. రిలీజైన ఐదు రోజులకే 500 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి, హిట్ రన్‌లో వుంది ‘పఠాన్’. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారూఖ్ ఖాన్ నుంచి వచ్చిన ఈ సినిమాకి ఇంత మంచి ఆదరణ దక్కుతుండడం విశేషం. అలాగే, ఈ మధ్య గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బాలీవుడ్ కూడా కాస్త ఊపిరి పీల్చుకుంది ఈ సినిమాతో. షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనె జంటగా తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ పోషించారు. సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







