తన పేరుతో మోసపూరిత సైట్లు, నకిలీ లింక్‌లు: అబ్షర్ హెచ్చరిక

- January 30, 2023 , by Maagulf
తన పేరుతో మోసపూరిత సైట్లు, నకిలీ లింక్‌లు: అబ్షర్ హెచ్చరిక

రియాద్: తన పేరుతో మోసపూరిత సైట్లు, నకిలీ లింక్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అబ్షర్ ప్లాట్‌ఫారమ్ హెచ్చరించింది. అధికారిక వెబ్‌సైట్ http://absher.sa లేదా Absher యాప్ ద్వారా మాత్రమే నని, వాటినే ఉపయోగించాలని సూచించింది. మోసపూరిత సందేశాలు,  నకిలీ లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వాటిని అసలైనదిగా నమ్మి ఓపెన్ చేయవద్దని అబ్షర్ హెచ్చరించింది. తమ సమీక్షలో కొన్ని నకిలీ లింక్‌లు http://www.abshir.sahttp://www.absher.com. గుర్తించినట్లు తెలిపింది. ఈ లింక్‌లు పూర్తిగా నకిలీవని, ఇవి వినియోగదారులను మోసం చేయడానికి ఉద్దేశించి తయారు చేసినవని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com