ఫిలిప్స్‌లో మరో 6వేల మంది ఉద్యోగులు తొలగింపు
- January 30, 2023
ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫిలిప్స్ మరోసారి ఉద్యోగులపై వేటు వేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 6 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఫిలిప్స్ ఉత్పత్తుల్లో ఒకటైన స్లీప్ రెస్సిరేటర్స్లో లోపాల కారణంగా కంపెనీకి భారీ నష్టాలు వచ్చాయి. ఫిలిప్స్ మూడు నెలల్లో రెండోసారి భారీగా ఉద్యోగులను తలింస్తున్నట్లు ప్రకటించింది.
కఠిన నిర్ణయమే అయినప్పటికీ, ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోక తప్పదని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాయ్ జాకోబ్స్ ప్రకటించారు. కంపెనీ పనితీరును మెరుగుపర్చుకోవడంఒ, ఉత్పతాదకతను పెంచుకోవడానికి, పని విధానాన్ని సులభతరం చేసుకోవడం అత్యవసరమని ఆయన చెప్పారు. 2025 నాటికి మరో 6 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపారు. 2022 అక్టోబర్‌లో కంపెనీ 4 వేల మంది ఉద్యోగులను తొలగించింది.
తాజా లేఆఫ్‌లో 2023లోనే దాదాపు 3 వేల మందిని తొలగించనున్నారు. రానున్న రెండేళ్లలో కంపెనీ మొత్తం 10 వేల మందిని తొలగించనుంది. నిద్రలేమితో స్లీప్ ఆప్నియా అనే సమస్యతో బాధపడేవారి కోసం ఫిలిప్స్ కంపెనీ స్లీప్ రెస్పిరేటర్స్‌ను ఉత్పత్తి చేసింది. ఈ మెసిణ్లలో లోపాల కారణంఆ రోగులకు విషపూరిత క్యాన్సర్ కారక ప్రభావాలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో 2021లో కంపెనీ ఈ మెషిన్లను వెనక్కి తీసుకుంది. ఈ రీకాల్ వల్ల 2022లో ఫిలిప్స్‌కు 1,605 బిలియన్ యూరోలు నష్టపోయింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







