ఏపీకి పెట్టుబడులు రాబట్టడమే టార్గెట్.. గ్లోబల్ సమ్మిట్‌కు సీఎం జగన్.. ఢిల్లీలో కీలక సమావేశం.
- January 31, 2023
న్యూ ఢిల్లీ: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగే ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా కర్టెన్‌రైజర్ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఢిల్లీ లీలా ప్యాలెస్ హెటల్‌లో దౌత్యవేత్తలతో సీఎం జగన్ సమావేశమవుతారు. ఈ సమావేశానికి వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఏపీలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల అంబాసిడర్లతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మార్చి 3,4 తేదీల్లో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగనుంది. ఈ గ్లోబల్ సమ్మిట్‌లో, బిజినెస్-టు-బిజినెస్, బిజినెస్-టు-గవర్నమెంట్ సమావేశాలు, కీలక ప్రసంగాలు, సెక్టార్-నిర్దిష్ట దేశ-నిర్దిష్ట ప్లీనరీ సెషన్లను నిర్వహించనున్నారు.
కాగా, అంతర్జాతీయ పెట్టుబడుదారుల సదస్సు విజయవంతం చేసేందుకు దేశంలో ముఖ్య నగరాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్నది ప్లాన్. తొలుత న్యూఢిల్లీలో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు 28 మంది విదేశీ పెట్టుబడిదారులు, 44 దేశాలకు చెందిన రాయబారులను ఆహ్వానించారు. ఏపీ అడ్వాంటేజ్ అనే థీమ్‌తో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను సీఎం జగన్ వివరిస్తారు.
రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణం, బలమైన పారిశ్రామిక, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయనే విషయాన్ని ఇన్వెస్టర్ల దృష్టికి తీసుకెళ్తారు. దీనికి తోడు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, ప్రత్యేక రాయితీలును వివరించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. వివిధ దేశాల రాయబారులతో ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు.
రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలను సీఎం జగన్ వివరిస్తారు. కర్టెన్ రైజర్ ఈవెంట్‌లతో పాటు ఫిబ్రవరిలో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై నగరాల్లో సైతం ఏపీ ప్రభుత్వం రోడ్డు షోలు నిర్వహించనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







