ఏవండోయ్ నానీ గారూ.! అయ్యో పాపం టార్గెట్ అయిపోయారూ.!
- January 31, 2023నేచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ సినిమా మార్చి 3న రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు షురూ చేశాడు నాని. ఈ క్రమంలోనే ‘దసరా’ ట్రైలర్ లాంఛ్ జరిగింది. ఈ ఈవెంట్లో నాని కాస్త నోరు జారాడు.
‘దసరా’ సినిమాపై మరీ ఎక్కువ అంచనాలు పెంచేసే ప్రయత్నం చేశాడు. అంచనాలు పెంచేస్తే ఫర్వాలేదు. ఏకంగా ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించాడు. గతేడాది ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టింది. ఈ ఏడాదికి ‘దసరా’ అలాంటి సినిమా అవుతుందంటూ, తన సినిమాని ఏకంగా ‘ఆర్ఆర్ఆర్’తో పోల్చేశాడు.
అదే జనానికి ఎక్కడో కాలింది. అన్నట్లు ‘దసరా’ ప్యాన్ ఇండియా సినిమా. ఎంత ప్యాన్ ఇండియా అయితే మాత్రం ‘ఆర్ఆర్ఆర్’తో పోలికేంటీ.? నానీ గారూ..! మీరు కాస్త తగ్గితే బెటరూ.. అంటూ నెటజిన్స్ ట్రోల్ చేస్తున్నారు.
కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ-అబుదాబి బీటెక్ ప్రోగ్రామ్‌ల్లో అడ్మిషన్లు
- సౌదీ అరేబియాలో 50% తగ్గిన ట్రాఫిక్ ప్రమాద మరణాలు
- వారికి బయోమెట్రిక్ నుండి మినహాయింపు..!
- మహిళపై 1 మిలియన్ దిర్హామ్‌ల కోసం వ్యక్తి దావా..!
- ఒమన్ లో వివిధ కేసులో పలువురు అరెస్ట్
- సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? వెహికిల్ హిస్టరీ తెలుసుకోండిలా
- సోనియాతో రేవంత్ భేటి..
- ఎన్నికల ఫలితాలకు ముందు 2 రోజులు మోడీ ధ్యానం..ఈసారి ఎక్కడంటే..!
- కీరవాణి వ్యవహారం పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- కవితకు దొరకని ఊరట.. బెయిల్‌పై తీర్పు రిజర్వ్