IIT ఢిల్లీ-అబుదాబి బీటెక్ ప్రోగ్రామ్‌ల్లో అడ్మిషన్లు

- May 29, 2024 , by Maagulf
IIT ఢిల్లీ-అబుదాబి బీటెక్ ప్రోగ్రామ్‌ల్లో అడ్మిషన్లు

యూఏఈ: IIT ఢిల్లీ మొదటి అంతర్జాతీయ క్యాంపస్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ అబుదాబి (IIT ఢిల్లీ - అబుదాబి) అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రారంభ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (BTech) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలను ప్రకటించింది. మొదటి రెండు ప్రోగ్రామ్‌లు ఎనర్జీ ఇంజనీరింగ్‌,  కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ కోర్సులను ఆఫర్ చేస్తుంది.  AI మరియు మెషీన్ లెర్నింగ్‌పై దృష్టి సారించి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో కోర్సులను రూపొందించినట్లు ప్రకటనలో వెల్లడించారు. ఒక్కో ప్రోగ్రామ్ 30 సీట్ల చొప్పున మొత్తం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి.  

అకడమిక్ ప్రోగ్రామ్‌లకు అడ్మిషన్‌లు కంబైన్డ్ అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ (CAET) 2024 మరియు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE-అడ్వాన్స్‌డ్) 2024 ద్వారా నిర్వహించనన్నారు. 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 3 వరకు తెరిచి ఉంటుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com