అయ్యో పాపం.! ఇలియానాకి ఏమైంది.?
- January 31, 2023గోవా బ్యూటీ ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన ఇలియానాకి ఇప్పుడంత సీనూ సినిమా లేకుండా పోయింది. ఎంత ప్రయత్నించినా పాపం తెలుగులో అవకాశాలు రావడం లేదు ఇలియానాకి. హిందీలో ఏదో అలా అలా కష్టపడుతోంది.
అసలు మ్యాటర్ ఏంటంటే తాజాగా ఇలియానా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. చేతికి ఐవీతో వున్న కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. దాంతో, ఇలియానాకి ఏమైంది.? అంటూ ఆరా మొదలైంది. దాంతో తనపై ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు కృతజ్థతలు తెలుపుతూ, ఇలియానా స్వయంగా రెస్పాండ్ అయ్యింది.
బాడీ డై స్మోర్ఫిక్ డిజార్డర్ అనే వ్యాధితో తాను బాధపడుతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం తన ఆరోగ్యం కాస్త కుదట పడిందట. కేవలం ఫ్లూయిడ్స్ మాత్రమే ఎక్కిస్తున్నారట. త్వరలో కోలుకుంటానని అభిమానుల్ని ఆందోళన పడొద్దని తెలిపింది ఇలియానా.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..