కబాలీ న్యూ పోస్టర్ ఆదివారం రిలీజైంది
- May 01, 2016
సూపర్ స్టార్ రజనీ కాంత్ మూవీ కబాలీ న్యూ పోస్టర్ ఆదివారం రిలీజైంది. నిముషం నిడివి ఉన్న ఈ టీజర్ ని విడుదల చేసినట్టు డైరెక్టర్ పా-రంజిత్ ట్వీట్ చేశారు. చేతిలో గన్ పట్టుకున్న రజనీ -..విలన్ ని హెచ్చరిస్తున్నట్టు గా ఉందీ టీజర్.. తన ఫ్యాన్స్ ఊహించినట్టుగానే రజనీ మరోసారి ఆకట్టుకున్నాడు. ఎవడ్రా కబాలీ అన్న విలన్ డైలాగుకు రజనీ విసిరిన కౌంటరే ఇందులోని బ్రీఫ్ థీమ్.. ప్రస్తుతానికి తమిళం లో మాత్రమే దీన్ని రిలీజ్ చేశారు.ఫస్ట్ విడుదల చేసిన దానికీ ఈ టీజర్ కీ చాలా డిఫరెన్స్ ఉందని అంటున్నారు మేకర్స్. వయస్సు పెరుగుతున్నా తన నటనలో ఏమాత్రం స్టేమినా తగ్గలేదని, తన ఫైటింగ్ స్టైల్లో ఎలాంటి మార్పు లేదని రజనీ చాటాడు. 'మీరెందుకన్నా డాన్ అయ్యారు' అని అడిగితే ఈ సూపర్స్టార్ తనదైన స్టైల్లో నవ్విన సీన్ ఈ టీజర్కు హైలైట్ అయ్యిందని అంటున్నారు. 1980 ప్రాంతాల్లోని తన సినిమాల్లోని మాదిరిగానే యంగ్ గెటప్లోనూ రజనీ ఇందులో కనిపించడం విశేషం. జూన్ 3న కబాలీ రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







