మస్కట్ నైట్స్: పిల్లల ఆట స్థలంలో కూలిన నిర్మాణం.. తప్పిన పెను ప్రమాదం
- February 01, 2023
మస్కట్: ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో మస్కట్ నైట్స్ యాక్టివిటీస్‌లో పిల్లల ఆటలో భాగంగా ఉన్న ఓ నిర్మాణం మంగళవారం సాయంత్రం సాంకేతిక లోపంతో కూలిపోయింది. అయితే గేమ్ ఆడుతున్న చిన్నారులకు పెద్దగా గాయాలు కాలేదని నిర్వాహకులు వెల్లడించారు.ఈ ఘటనపై మస్కట్ మునిసిపాలిటీ తన ట్విట్టర్ ఖాతాలో విచారం వ్యక్తం చేసింది. "ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో పిల్లల ఆటలలో ఒకదానిలో సాంకేతిక లోపం కారణంగా సంభవించిన ప్రమాదం గురించి మునిసిపాలిటీ విచారం వ్యక్తం చేస్తోంది." అని పేర్కొంది. పిల్లలకు ఎటువంటి తీవ్రమైన గాయాలు లేవని మునిసిపాలిటీ ధృవీకరించింది. “వైద్య అధికారులు, ప్రత్యేక బృందాలు గాయపడిన వ్యక్తులను పరీక్షించి, వారిలో ఆరుగురిని పరీక్షల కోసం ఆసుపత్రులకు తరలించారు. అదృష్టవశాత్తూ, ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదు. ” అని మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం