అల్-ఖురయ్యత్లో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి
- February 01, 2023
సౌదీ: అల్-ఖురయ్యత్ లో ఓ ఇంట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి చెందారు. ఇందులో నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలతో సహా ఒక తండ్రి ఉన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారి తల్లి పరిస్థితి విషమంగా ఉంది. అధికారుల కథనం ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున అల్-జౌఫ్ ప్రాంతంలోని అల్-ఖురాయత్ గవర్నరేట్‌లోని తషీలత్ పరిసరాల్లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అల్-ఖురయ్యత్లోని సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ ఆపరేషన్ గదికి తెల్లవారుజామున 4:00 గంటలకు అగ్నిప్రమాదం గురించి సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సివిల్ డిఫెన్స్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ముగ్గురు పిల్లలు సంఘటనా స్థలంలో చనిపోగా.. తండ్రి, ముగ్గురు పిల్లలు అల్-ఖురయ్యత్ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ప్రాథమిక నివేదికల ప్రకారం, పిల్లల బెడ్రూమ్లోని గ్యాస్ హీటర్ నుండి మంటలు చెలరేగాయి. దాంతో అక్కడ ముగ్గురు పిల్లలు చనిపోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం