వడ్డీ రేట్లపై ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- February 02, 2023
దోహా: వడ్డీ రేట్లపై ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) కీలక ప్రకటన చేసింది. డిపాజిట్ వడ్డీ రేటు, రుణ వడ్డీ రేటు, రెపో రేటుకు సంబంధించి ప్రస్తుత వడ్డీ రేట్లను యధాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు QCB తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఒక ప్రకటన విడుదల చేసింది. "ఖతార్ సెంట్రల్ బ్యాంక్ ఖతార్ రాష్ట్రం ప్రస్తుత ద్రవ్య అవసరాలను అంచనా వేసింది. QCB డిపాజిట్ రేటు, QCB లెండింగ్ రేటు, QCB రెపో రేటు కోసం ప్రస్తుత వడ్డీ రేట్లను కొనసాగించాలని నిర్ణయించింది." అని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. ఖతార్ స్థిరమైన ఆర్థిక వృద్ధికి మద్దతుగా ప్రస్తుత వడ్డీ రేట్లను తగిన స్థాయిలో నిర్వహించడం QCB లక్ష్యం అని పేర్కొంది.
QCB ప్రస్తుత వడ్డీ రేట్లు
• QCB డిపాజిట్ వడ్డీ రేటు (QCBDR) 5 శాతం
• QCB రుణ వడ్డీ రేటు (QCBLR) 5.50 శాతం
• QCB రెపో రేటు (QCBRR) 5.25 శాతం
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం