కువైట్ చరిత్రలోనే తొలిసారిగా.. భారీగా డ్రగ్స్ స్వాధీనం

- February 02, 2023 , by Maagulf
కువైట్ చరిత్రలోనే తొలిసారిగా.. భారీగా డ్రగ్స్ స్వాధీనం

కువైట్ : కువైట్ చరిత్రలోనే తొలిసారిగా భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధికారులు దాదాపు 15 మిలియన్ల లిరికా (ప్రీగాబాలిన్) మాత్రలు, ముడి పౌడర్ రూపంలో అర టన్ను ఔషధాలను స్వాధీనం చేసుకున్నారని  మంత్రిత్వ శాఖ తెలిపింది. మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి, తాత్కాలిక రక్షణ మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబా మాట్లాడుతూ.. పక్కా సమాచారం మేరకు అధికారులు ఒక భారీ మత్తుపదార్థాల నిల్వ కేంద్రంపై దాడి చేసినట్లు తెలిపారు. ఈ స్థావరాన్ని అంతర్జాతీయ ముఠా నిర్వహిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. క్యాప్సూల్స్‌లో ప్యాక్ చేసి విక్రయించే డ్రగ్‌తో పాటు పౌడర్ రూపంలో టాబ్లెట్‌లను ఈ ముఠా తయారు చేస్తుందని తెలిపారు. సంఘటనా స్థలంలో నలుగురిని అరెస్టు చేశామన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com