తేనెలో డ్రై ఫ్రూట్స్ కలిపి తీసుకుంటే, ఆరోగ్యానికి ఎంతో మేలో తెలుసా.?

- February 02, 2023 , by Maagulf
తేనెలో డ్రై ఫ్రూట్స్ కలిపి తీసుకుంటే, ఆరోగ్యానికి ఎంతో మేలో తెలుసా.?

డ్రై ప్రూట్స్ ఆరోగ్యానికి ఎప్పుడూ మేలే. అయితే, కాస్త ఎక్కువ రేటుతో కూడుకున్నవి కదా. అయినా ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నా, మేలు మాత్రం ఎక్కువగానే కలుగుతుంది. 

ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో డ్రై ప్రూట్స్ తీసుకోవడం తప్పని సరి అంటున్నారు వైద్య నిపుణులు. 

ఇక తేనెతో కలిపి డ్రై ప్రూట్స్‌ని తీసుకోవడం మరింత మేలు కలిగిస్తుందని చెబుతున్నారు. తేనెలో డ్రై ప్రూట్స్ నానబెట్టి తినడం వల్ల దీర్ఘ కాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చట. బాదం కానీ, జీడి పప్పు కానీ, పిస్తా, కిస్‌మిస్.. ఇలా ఏదైనా అన్ని రకాలు కాకపోయినా, ఏదో ఒక రకం రోజూ కొద్ది మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా వుంటుందట. 

తేనెలో డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తినడం వల్ల హార్ట్ ఎటాక్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
అలాగే ఇమ్యూనిటీ (రోగ నిరోధక శక్తి) బాగా పెరుగుతుంది. జీర్ణ వ్యవస్త సక్రమంగా వుంటుంది. 

డ్రై ఫ్రూట్స్‌ని ఐదారు గంటలు నీటిలో నానబెట్టి తీసి, తర్వాత తర్వాత రెండు గంటలు తేనెలో నానబెట్టి తినాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com