పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత..

- February 05, 2023 , by Maagulf
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత..

దుబాయ్‌: పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు.దుబాయ్‌లోని అమెరికన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ముషారఫ్ మృతితో పాకిస్తాన్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

1943 ఆగస్టులో 11న ముషారఫ్ జన్మించారు. దేశ విభజనకు ముందు ఢిల్లీలో ముషారఫ్ జన్మించారు. దేశ విభజన తర్వాత ముషారఫ్ కుటుంబం పాకిస్తాన్‌కు వెళ్లిపోయి అక్కడ స్థిరపడింది. 2011 నుంచి 2018 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా ముషారఫ్ పనిచేశారు. సైన్యంలో చేరిన ముషారఫ్.. అక్కడ అంచెలంచెలుగా ఎదిగారు. పాక్ సైనికదళాల ప్రధాన అధిపతిగా పనిచేసిన ఆయన.. 1999లో అప్పటి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. రెండేళ్లపాటు సైనిక పాలకుడిగా పనిచేసిన ముషారఫ్.. ఆ తర్వాత పాకిస్తాన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అభిశంసనను తప్పించుకునేందుకు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 2016 నుంచి ముషారఫ్ దుబాయ్‌లోనే ఉంటున్నారు. కార్గిల్ యుద్దానికి ప్రధాన కారకుడు ముషారఫ్ అని చెబుతూ ఉంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com