రుణం ఇప్పిస్తామని మోసం.. ఇద్దరు వ్యక్తులకు dh360,000 జరిమానా, జైలుశిక్ష
- February 05, 2023
దుబాయ్: బ్యాంకుల నుండి రుణాలు ఇప్పిస్తామని ఒక ఆఫ్రికన్ పెట్టుబడిదారుని మోసం చేసిన ఆసియాకు చెందిన ఇద్దరు పెట్టుబడిదారులకు దుబాయ్ కోర్టు భారీ జరిమానా, జైలుశిక్ష విధించింది. మోసానికి పాల్పడ్డ నిందితులకు రెండు నెలల జైలు శిక్షతోపాటు సంయుక్తంగా $100,000 (Dh367,310) జరిమానాను కోర్టు విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఒక దక్షిణాఫ్రికా పెట్టుబడిదారుడు తనను ఇద్దరు ఆసియన్లు మోసగించారని కేసు పెట్టారు. నిందితుల్లో ఒకరు మరొకరి హామీతో స్థానిక బ్యాంకుల నుండి రుణాలు పొందడంలో తన సహాయాన్ని అందిస్తామని ముందుకొచ్చారని పేర్కొన్నారు. Dh500,000 కమీషన్ చెల్లిస్తే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని మోసం చేశారని తెలిపారు. దుబాయ్‌లోని అనేక మంది పెట్టుబడిదారులకు తమ వ్యాపారాలను విస్తరించడానికి సహాయం చేసినట్లు నిర్ధారించే పత్రాలను చూపించిన రెండవ నిందితుడిని తాను కలిశానని బాధితుడు చెప్పాడు. స్థానిక బ్యాంకుల్లో ఉన్నత పదవుల్లో ఉన్న పరిచయస్తులు, స్నేహితులు ఉన్నట్లు కూడా నిందితులు మాట్లాడారని ఆయన తెలిపారు. కేసు ఫైల్ ప్రకారం.. పెట్టుబడిదారుడు నిందితులకు, తనకు మధ్య జరిగిన పత్రాలు, సంభాషణలను కోర్టుకు సమర్పించారు. అతను మొదటి నిందితుడి భార్యకు $100,000 బదిలీ చేసినట్లు రుజువు చేసే బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా సమర్పించారు. కేసును విచారించిన కోర్టు నిందితులకు జరిమానా, జైలుశిక్ష విధించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..