కీలక ఒప్పందాలపై సంతకాలు చేసిన సౌదీ అరేబియా, ఒమన్
- February 05, 2023
రియాద్: కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సముద్రగర్భ కేబుల్ పెట్టుబడుల రంగంలో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌పై సౌదీ అరేబియా, ఒమన్ లు సంతకం చేశాయి. సౌదీ అరేబియాకు చెందిన అబ్దుల్లా అల్ స్వాహా, ఒమన్‌కు చెందిన సయీద్ బిన్ హమూద్ అల్-మవాలీ సమక్షంలో కింగ్‌డమ్ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సుల్తానేట్ రవాణా, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మధ్య ఈ ఒప్పందం సంతకాలు జరిగాయి. కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల కోసం మౌలిక సదుపాయాల రంగంలో సహకారాన్ని మెరుగుపరచడానికి, డేటా మార్పిడి కోసం హై-స్పీడ్ డిజిటల్ ఇంటర్‌కనెక్షన్ కోసం ఇది దోహదం చేస్తుందన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ పెట్టుబడి సంస్థలు, లైసెన్స్ పొందిన కంపెనీల ద్వారా ప్రాంతీయ డిజిటల్ కనెక్టివిటీని అమలు చేయడానికి ఎంపికలను అభివృద్ధి చేయడం, గ్లోబల్ డేటా సెంటర్‌లు, ప్రాంతీయ ఉనికిని లక్ష్యంగా చేసుకునే క్లౌడ్ సేవలలో పెట్టుబడిని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుందని ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







