సెంట్రల్ టర్కీలో 7.9 తీవ్రతతో భారీ భూకంపం
- February 06, 2023
టర్కీ: సోమవారం తెల్లవారుజామున ఆగ్నేయ టర్కీలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. టర్కీ ప్రధాన నగరం, ప్రావిన్షియల్ రాజధాని గాజియాంటెప్‌కు 33 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇది నూర్దగి పట్టణానికి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఇది 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. మొదటి భూకంపం వచ్చిన 10 నిమిషాల తర్వాత రెండోసారి 6.7 తీవ్రతతో మరోసారి ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది. టర్కీకి చెందిన డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రకారం.. భూకంపం 7.4గా నమోదైంది. కహ్రామన్మరాస్ ప్రావిన్స్‌లోని పజార్సిక్ పట్టణంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని చెప్పారు. పొరుగు ప్రావిన్సులైన మలత్యా, దియార్బాకిర్, మలత్యాలలో అనేక భవనాలు కూలిపోయాయని హేబర్‌టర్క్ టెలివిజన్ నివేదించింది. ప్రాణనష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది. భూకంపం తీవ్రతకు లెబనాన్, సిరియాలో కూడా ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. గ్రీస్, జోర్డాన్, ఇరాక్, యూకేతో సహా ఇతర దేశాలను కూడా భూకంపం ప్రభావితం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తర నగరం అలెప్పో, సెంట్రల్ సిటీ హమాలో కొన్ని భవనాలు కూలిపోయాయని సిరియా మీడియా నివేదించింది. సిరియా వాయువ్య ప్రాంతంలో టర్కీ సరిహద్దులో అనేక భవనాలు కూలిపోయాయని ప్రతిపక్ష సిరియన్ సివిల్ డిఫెన్స్ తెలిపింది. బీరూట్, డమాస్కస్‌లలో భవనాలు కంపించడంతో చాలా మంది ప్రజలు భయంతో వీధుల్లోకి పరిగెత్తినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష