ఆవ నూనెతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!
- February 06, 2023
ఆవ నూనెను ఎక్కువగా నార్త్ ఇండియాలో వాడుతుంటారు. సౌత్‌లో దీని వాడకం తక్కువే. కానీ, ఆవాలను గింజల రూపంలో సౌత్ ఇండియన్లు ఎక్కువగా తీసుకుంటుంటారు. ప్రతీ రోజూ వాడుతుంటారు తాలింపు దినుసుల రూపంలో.
అయితే, ఆవ గింజల కన్నా, ఆవ నూనెతో అందే ఆరోగ్య ప్రయోనాలు అనేకం అని చెబుతున్నారు. ఆవనూనెలో ఒమెగా 3 ఫాటీ ఆమ్లాలు అధికంగా వుంటాయ్. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేసే గుణం దీనికి చాలా ఎక్కువ.
అలాగే, గుండె సంబంధింత వ్యాధులు దరి చేరకుండా వుండేందుకు ఆవ నూనె తోడ్పడుతుంది.
ఆవ నూనెను అధికంగా తీసుకునే వారి శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలకు అస్సలు అవకాశం వుండదని ఓ సర్వేలో తేలింది.
కొన్ని హానికరమైన ఫంగస్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. స్వచ్ఛమైన ఆవనూనె జట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు చర్మాన్ని కాంతివంతం చేసేందుకు తోడ్పడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఆవనూనె దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్లను నియంత్రణలో వుంచేందుకు తోడ్పడుతుందని తేలింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం