అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు శుభవార్త

- February 06, 2023 , by Maagulf
అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు శుభవార్త

అమెరికా: అమెరికా వీసాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తోన్న భారతీయులకు మన దేశంలోని అమెరికా రాయబార కార్యాలయం గుడ్ న్యూస్ తెలిపింది. వెయిటింగ్ పీరియడ్ ను తగ్గించేందుకు నిబంధనలు మార్చినట్లు వెల్లడించింది. భారతీయులు ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి అమెరికా ఎంబసీల్లో కూడా వీసా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని పేర్కొంది. అమెరికా వీసా కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న ఓ భారతీయ విద్యార్థి, ఏదైనా పని ఉండి థాయ్ లాండ్ వెళ్తే అక్కడి అమెరికా ఎంబసీల్లో కూడా తన వీసా కోసం ఇంటర్వ్యూకు హాజరయ్యే అవకాశం కల్పించారు.

భారత్ నుంచి వీసా దరఖాస్తులు భారీగా వస్తుండటంతో వెయిటింగ్ పీరియడ్ కూడా సుదీర్ఘంగా ఉంటోంది. దీంతో వెయ్యి రోజులు ఉన్న వెయిటింగ్ పీరియడ్ ను ఇటీవలే 500 రోజులకు తగ్గించారు. అంటే ఒక విద్యార్థి లేదా ఉద్యోగస్తుడు అమెరికా వీసా కోసం దాదాపు 2 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వస్తోంది. ఇంతటి సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్ ఏ దేశానికి లేదు.

త్వరలో విదేశీ పర్యటన చేయనున్న ఎవరైనా వారు వెళ్లే దేశంలోని అమెరికా ఎంబీసీ లేదా కాన్సులేట్ లో అమెరికా వీసా కోసం ఇంటర్వ్యూ అపాయింట్ మెంట్ పొందే అవకాశం కల్పించారు. అలాగే బీ1, బీ2 వీసాల కోసం భారతీయులకు థాయ్ లాండ్ వంటి దేశాల్లో ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com