ఎయిర్ విస్తారా విమానయాన సంస్థకు రూ.70 లక్షల జరిమానా
- February 06, 2023
ముంబై: ఎయిర్ విస్తారా విమానయాన సంస్థకు రూ. 70 లక్షల జరిమానా విధిస్తూ షాక్ ఇచ్చింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA). 2022 ఏప్రిల్ లో దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో కనీస విమాన సర్వీసులను నిర్వహించనందుకు..నిబంధనలను పాటించనందుకు గత అక్టోబర్ లో ఎయిర్ విస్తారాకు జరిమానా విధించింది. దీంతో ఎయిర్ విస్తారా సంస్థ జరిమాని చెల్లించింది అని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు.
విస్తారా ప్రతినిధి స్పందిస్తూ.. విస్తారా గత కొన్నేళ్లుగా RDG (రూట్ డిస్పర్సల్ గైడ్‌లైన్స్)ని అనుసరిస్తోందని..నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను 2022 అక్టోబర్‌లో డీజీసీఏ విమానయాన సంస్థపై జరిమానా విధించిందని తెలిపారు. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి సెక్టార్‌లో కనీస విమానాల సంఖ్య గురించి ఎయిర్‌లైన్ కంపెనీలకు దిశ నిర్దేశం చేస్తుంది డీజీసీఏ. ఈ నిబంధనలను పాటించి తీరాల్సిందే. ఈ నిబంధనలు పాటించే విధంగా డీజీసీఏ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఈక్రమంలో నిబంధనలను పాటించనందుకు ఎయిర్ విస్తారాకు రూ.70లక్షలు జరిమానా విధించింది డీజీసీఏ.
ఉత్తర పశ్చిమ బెంగాల్ లోని బాగ్ డోగ్రా విమానాశ్రయాన్ని మూసివేయడటం వల్ల కొన్ని విమాన సర్వీసుల్ని రద్దు చేయాల్సి వచ్చిందని ఏప్రిల్ 2022 విమానంలో హైడ్రాలిక్ వైఫల్యం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా విమానం వెనక్కి వెళ్లవలసి వచ్చిందని తెలిపారు. కాగా.. కొన్ని రోజుల క్రితం డిజిసిఎ ఎయిర్ ఇండియాపై కూడా రూ. 30 లక్షల జరిమానా విధించింది. విమానంలో మహిళతో అనుచితంగా ప్రవర్తించినందుకు ఎయిర్ ఇండియాకు ఈ జరిమానా విధించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు