ఫ్యాన్స్‌కి క్లాస్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీయార్.!
- February 06, 2023
యంగ్ టైగర్ ఎన్టీయార్ ఫ్యాన్స్‌కి బాగా గడ్డి పెట్టేశాడు. అప్డేట్స్ .. అప్డేట్స్.. అంటూ ఈ మధ్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. డైరెక్టర్లూ, హీరోలూ, మ్యూజిక్ డైరెక్టర్లూ.. ఇలా ఏ ఒక్కర్నీ వదిలేదే.. లే అంటున్నారు ఫ్యాన్స్. దారుణంగా తిట్టి పోస్తున్నారు. ఇక, ఎన్టీయార్ 30 విషయానికి వస్తే, నిర్మాతల్ని ఛండాలంగా తగులుకుంటున్నారు. అలాంటి వారందరి నోళ్లకి తాళం వేసేలా మాట్లాడాడు తాజాగా ఎన్టీయార్.
‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి గెస్ట్‌గా విచ్చేసిన ఎన్టీయార్.. ఫ్యాన్స్ చేస్తున్న అనవసరమైన హంగామాపై గట్టిగా గడ్డి పెట్టేశాడు. ‘తెలుగు సినిమా స్థాయి గ్లోబల్ రేంజ్‌ని అందుకుంది. ఈ తరుణంలో తర్వాత రాబోయే ప్రతీ సినిమా విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేయాలి.. ఏమాత్రం తొందరపాటు పనికి రాదు.. ఏదైనా అప్డేట్ వుంటే మా ఇంట్లో మా భార్యల కన్నా ముందు మీకే చెబుతాం.. హడావిడిలో ఏదో ఒక అప్డేట్ ఇచ్చేస్తే..నచ్చలేదని మళ్లీ మీరే తిడతారు. అందుకే, దయచేసి అభిమానులు సంయమనం పాటించాలి.. అని ఎన్టీయార్ వ్యాఖ్యానించారు.
తన కొత్త సినిమా త్వరలో స్టార్ట్ అవుతుందనీ, మార్చి నుంచి రెగ్యలర్ షూట్ ప్రారంభిస్తామనీ, వచ్చే ఏడాదిలో సినిమా రిలీజ్ వుంటుందని కూడా క్లారిటీ ఇచ్చేశారు ఈ సందర్భంగా ఎన్టీయార్.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







