కీటక ఆహార ఉత్పత్తుల దిగుమతిని నిషేధించిన కువైట్

- February 07, 2023 , by Maagulf
కీటక ఆహార ఉత్పత్తుల దిగుమతిని నిషేధించిన కువైట్

కువైట్: కీటకాలను కలిగి ఉన్న ఆహార ఉత్పత్తుల దిగుమతిని కువైట్ నిషేధించింది. సామూహిక వినియోగం కోసం విక్రయించే ఆహార పదార్థాలకు కీటకాల పొడిని జోడించడానికి యూరోపియన్ యూనియన్ ఇటీవల నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కువైట్  సమావేశమైన పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్ ఫుడ్ టెక్నికల్ కమిటీ.. కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులను దేశంలోకి దిగుమతి చేసుకోవడంపై నిషేధం విధించింది. ఈ ఆహారాల దిగుమతిపై నిషేధం ఆమోదించబడిన గల్ఫ్ నిబంధనలకు (హలాల్ ఫుడ్)  అనుగుణంగా ఉందని తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com