భూకంప మృతుల కుటుంబాలకు క్రౌన్ ప్రిన్స్ సంతాపం

- February 07, 2023 , by Maagulf
భూకంప మృతుల కుటుంబాలకు క్రౌన్ ప్రిన్స్ సంతాపం

రియాద్: విధ్వంసకర భూకంపంలో మరణించిన వారికి సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌తో సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఫోన్ చేసి మాట్లాడారు. విపత్తును అధిగమించడానికి సౌదీ మద్దతుగా నిలుస్తుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా టర్కీ అధ్యక్షుడికి, ప్రజలతో పాటు భూకంప మృతుల కుటుంబాలకు క్రౌన్ ప్రిన్స్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com