ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఏ గోరంట్ల బుచ్చిబాబు అరెస్టు
- February 08, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా సంచలనంగా సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది. బుచ్చిబాబు గతంలో ఎమ్మెల్సీ కవితతోపాటు వ్యాపారి రామచంద్ర పిళ్లై వద్ద చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేశారు.
బుచ్చిబాబు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర వహించాడని, దీని ద్వారా హైదరాబాద్‌కు చెందిన పలు మద్యం సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించాడనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మంగళవారం రాత్రి బుచ్చిబాబును సీబీఐ అధికారులు విచారించారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్టును అధికారులు ధృవీకరించారు. బుధవారం బుచ్చిబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెడతారు. అనంతరం కోర్టు నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది సీబీఐ. బుచ్చిబాబును తమ కస్టడీకి అప్పగించమని సీబీఐ కోరే అవకాశం ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి గత ఏడాదిలో హైదారాబాద్ నగరంలో ఈడీ అధికారులు అనేక చోట్ల దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో భాగంగా అప్పట్లో బుచ్చిబాబు ఆఫీసులో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇటీవలే సీబీఐ అధికారులు రెండో చార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురి పేర్లను సీబీఐ ప్రస్తావించింది. వారికి నోటీసులు కూడా ఇచ్చింది. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..