భలే ఛాన్స్ కొట్టేసిన టిల్లుగాడు.!
- February 08, 2023
‘డీజె టిల్లు’ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకున్న యంగ్‌స్టర్ సిద్దు జొన్నలగడ్డ. ‘డీజె టిల్లు’ సూపర్ సక్సెస్ అందుకోవడంతో, ఆ సినిమాకి సీక్వెల్ పనులు వెంటనే మొదలెట్టేశాడు సిద్దు.
ఆ సినిమా పనుల్లో బిజీగా వుండగానే మరో సినిమానీ ఓకే చేసేశాడు. ఈ సారి పెద్ద తలకాయనే పట్టేశాడు. సుకుమార్ శిష్యురాలైన వైష్ణవితో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సుకుమార్ శిష్యురాలు కాబట్టి, సుకుమార్‌తోనూ ఖచ్చితంగా టచ్‌లో వున్నట్లే సిద్దు. అంతేకాదు, ఈ సినిమాకి సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామ్యం వహిస్తోంది కూడా.
మనోడు కేవలం హీరోగానే కాకుండా, టెక్నికల్‌గానూ మాంచి సౌండ్ కావడంతో, కొత్త డైరెక్టర్ అయిన వైష్ణవితో కలిసి ఏదైనా మ్యాజిక్ చేయగలిగితే, ‘డీజె టిల్లు’ మాదిరి మరో బ్యాండ్ బాజా కొట్టేందుకు ఖచ్చితంగా ఛాన్స్ లేకపోలేదు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!