సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
- February 08, 2023
న్యూఢిల్లీ: ఫాం హౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసును సీబీఐకు అప్పగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సీజేఐ ధర్మాసనం నిరాకరించింది. కేసును విచారించి మెరిట్స్ ఉంటే హైకోర్టు తీర్పును రివర్స్ చేస్తామని సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. కేసును ఫాస్ట్ ట్రాక్ చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. ఫాం హౌస్ కేసులో హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంను ఆశ్రయించింది. సీబీఐ కేసు విచారణ చేపడితే సాక్ష్యాలన్నీ ధ్వసం అవుతాయని పిటిషన్లో ఆందోళన వెలిబుచ్చింది.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!