ఒమన్‌లో పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న ప్రవాసి అరెస్ట్
- February 08, 2023
మస్కట్: అల్ అమెరత్‌లోని విలాయత్‌లోని తన వసతి గృహం కేంద్రంగా పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న ప్రవాస కార్మికుడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ సహకారంతో జ్యుడీషియల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, రాయల్ ఒమన్ పోలీస్ (ROP) అరెస్ట్ చేసింది. ఓ ప్రవాస కార్మికుడు పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నాడని సమాచారం అందిందని అథారిటీ తెలిపింది. మార్కెట్స్ రెగ్యులేషన్, మానిటరింగ్ డిపార్ట్‌మెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న అథారిటీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి సెర్చ్ వారెంట్ పొందిన తర్వాత ప్రవాసిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. అతని వద్ద 4535 బస్తాలలో నిల్వచేసిన వివిధ రకాల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1800 ఒమానీ రియాల్స్ నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రవాసిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. పోగాకు విక్రయాలపై సమాచారం ఉంటే నివేదించాలని అథారిటీ వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ
- మస్కట్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...







