షిర్డీ వెళ్లే భక్తులకు శుభవార్త..
- February 08, 2023
షిర్డీ: షిర్డీ వెళ్లే భక్తులకు సెంట్రల్ రైల్వే శుభవార్త అందించింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ముంబై-షిర్డీ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కనుంది. ఆ రోజు నాశిక్ రోడ్ స్టేషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ట్రైన్‌ను ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 11 అనగా శనివారం నుంచి ప్రయాణీకులకు వందేభారత్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ ట్రైన్ ప్రారంభ వేడుకలకు సిద్దం చేస్తున్నామని.. త్వరలోనే రిజర్వేషన్లను సైతం ప్రయాణీకులకు అందుబాటులోకి తెస్తామని రైల్వే అధికారులు తెలిపారు.
ఫిబ్రవరి 11 నుంచి ఈ ట్రైన్ ఉదయం 6.15 గంటలకు ముంబై నుంచి బయల్దేరి.. ఉదయం 9.27 గంటలకు నాశిక్ రోడ్ స్టేషన్, సాయినగర్ షిర్డీకి మధ్యాహ్నం 12.10 గంటలకు చేరుతుంది. మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు షిర్డీలో సాయంత్రం 5.25 గంటలకు బయల్దేరి.. నాశిక్ రోడ్ స్టేషన్ 8.43 గంటలకు, ముంబై రాత్రి 11.18 గంటలకు చేరుకుంటుంది.
ఈ ట్రైన్ ముంబై-షిర్డీ మధ్య ఉన్న దూరాన్ని కేవలం 5 గంటల 55 నిమిషాల్లో చేరుకుంటుంది. అలాగే ముంబై టూ షిర్డీ ఏసీ చైర్ కారు రూ. 800, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు రూ. 1630గా ఉండొచ్చునని అంచనా. అటు ముంబై – నాశిక్ ఏసీ చైర్ కారు రూ. 550, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు రూ. 1,150గా ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే ఈ టికెట్ ధరలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ
- మస్కట్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...







