ఈ-వీసా, వీసా ఆన్ అరైవల్ అందించే దేశాలకే పర్యాటకుల మొగ్గు!
- February 09, 2023
యూఏఈ: యూఏఈ నివాసితులు ఇ-వీసా, వీసా ఆన్ అరైవల్ అందించే దేశాలకు వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అజర్బైజాన్, మాల్దీవులు, జార్జియా, అర్మేనియా ఇతర అనేక దేశాలు యూఏఈ నివాసితులు, జాతీయులకు వీసా-ఆన్-అరైవల్ లేదా ఇ-వీసా సేవలను అందిస్తున్నాయని VFS గ్లోబల్ సీనియర్ అధికారి తెలిపారు. కోవిడ్-19 తర్వాత యూఏఈ నుండి అవుట్‌బౌండ్ ట్రావెల్, టూరిజం విపరీతంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం పర్యాటక రంగం మహమ్మారికి ముందు స్థాయికి చేరుకుందన్నారు. థాయిలాండ్, సురినామ్, ఇటీవల ఇండోనేషియా (ఇది సెప్టెంబర్ 2022లో ప్రారంభమైంది) వంటి ఇ-వీసా, వీసా-ఆన్-అరైవల్ సేవలను అందించే దేశాలకు డిమాండ్ పెరిగిందని VFS గ్లోబల్ మిడిల్ ఈస్ట్ హెడ్ ప్రణవ్ సిన్హా తెలిపారు.
కెనడా, యుకె, యూరప్ వంటి ప్రముఖ దేశాల్లో హాలిడే ప్యాకేజీలకు యూఏఈ నివాసితుల నుంచి డిమాండ్ ఉందని సిన్హా చెప్పారు. ప్రజలు ఈ-వీసా లేదా వీసా ఆన్ అరైవల్ అందించే దేశాలను సందర్శించడానికి ఇష్టపడుతున్నారని చెప్పారు. వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి క్యూలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని, కాన్సులేట్లు, రాయబార కార్యాలయాల నుండి అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం లేనందున పర్యాటకులు వీసా ఆన్ అరైవల్ అందించే దేశాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నరని ప్రణవ్ సిన్హా తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష