చారిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరుకున్న దుబాయ్ లో అద్దెలు
- February 09, 2023
యూఏఈ: దుబాయ్ లో అద్దెలు చారిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. కొన్ని ఏరియాల్లో దాదాపు Dh14,000 వార్షిక అద్దె పెరుగుదల నమోదు చేసుకుంది. గత 10 సంవత్సరాలుగా జబీల్ ప్రాంతంలోని మూడు పడక గదుల అపార్ట్‌మెంట్ వార్షిక అద్దె 70,000 దిర్హామ్‌ల నుండి 84,000 దిర్హామ్‌లకు పెరిగిందని ఓ నివాసితురాలు చెప్పారు. దుబాయ్ అంతటా సగటు పెరుగుదల నమోదు అయింది. గత సంవత్సరం కంటే అద్దెలు దాదాపు 27 శాతం పెరుగుదల నమోదు చేసుకున్నట్లు పలువురు నివాసితులు తెలిపారు. అపార్ట్‌మెంట్ కాంట్రాక్టుల సగటు అద్దె ధరలు 2021తో పోలిస్తే దాదాపు 21 శాతం పెరిగాయని, విల్లాల ధరలు 37 శాతం పెరిగాయని రియల్ ఎస్టేట్ మార్కెట్‌ప్లేస్ ప్రాపర్టీ ఫైండర్ చెప్పారు.
ఎక్కడికక్కడ అద్దెలు పెరిగాయంటే..
రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్ హౌజాలో మార్కెటింగ్ హెడ్ సారా హెవర్డిన్ మాట్లాడుతూ.. దుబాయ్ హిల్స్ వంటి కమ్యూనిటీలలో అద్దెల ధరల పెరుగుదల 20 శాతంగా ఉందన్నారు. ద వ్యూస్ అండ్ ది గ్రీన్స్‌లో, దుబాయ్ అంతటా ఆక్యుపెన్సీ అత్యధికంగా ఉంది. అద్దె పెరుగుదల సగటున 10-15 శాతంగా ఉందని సారా హెవర్డిన్ తెలిపారు. దుబాయ్ మెరీనాలో అపార్ట్‌మెంట్‌ల సగటు అద్దె ధర 31 శాతం పెరిగిందని, జుమేరా లేక్ టవర్స్ యూనిట్లు 16 శాతం పెరిగాయని ప్రాపర్టీ ఫైండర్ ఇటీవలి డేటా సూచిస్తుంది. మరోవైపు, జుమేరా విలేజ్ సర్కిల్‌లో విల్లాల సగటు అద్దె ధర 17 శాతం పెరిగింది. అయితే పామ్ జుమేరాలో 2022లో ఇది 30 శాతం పెరగడం విశేషం.
అద్దె తక్కువున్న ప్రాంతాలు
దుబాయ్‌లో 2 పడకల అపార్ట్మెంట్ సగటున Dh30,000 కు అందుబాటులో ఉన్నాయి. రస్ అల్ ఖోర్ 40,000, ఇంటర్నేషనల్ సిటీ Dh 50,000, దుబాయ్ సౌత్ లో Dh 55,000 లకు అందుబాటులో ఉన్నట్లు రియల్ పోర్టల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇక 4 పడకల విల్లా విషయానికి వస్తే.. దుబాయ్ సౌత్‌లో Dh110,000, మిర్డిఫ్‌లోని విల్లాలు Dh130,000 వరకు అందుబాటులో ఉన్నాయి.
అద్దెలు ఎందుకు పెరిగాయంటే..
కొత్త రెసిడెన్సీ , వీసా విధానాలు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలుగా రియల్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గోల్డెన్ వీసా పథకం, కొత్త ఐదేళ్ల గ్రీన్ రెసిడెన్సీ లతోపాటు గత సంవత్సరం అమలులోకి వచ్చిన అనేక రెసిడెన్సీ సంస్కరణల కారణంగా దుబాయ్ లో అద్దెలు ఇటీవల విపరీతంగా పెరిగాయి. అలాగే దుబాయ్ లో పలు అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టడం, బిజినెస్ డెస్టినేషన్ గా దుబాయ్ మారడం కారణంగా కూడా ఇటీవల అద్దెలు పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష