యూఏఈ టూర్ ఉమెన్ 2023 సైక్లింగ్ ఈవెంట్: కీలక రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

- February 09, 2023 , by Maagulf
యూఏఈ టూర్ ఉమెన్ 2023 సైక్లింగ్ ఈవెంట్: కీలక రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

దుబాయ్: ఫిబ్రవరి 9న ప్రారంభమయ్యే యూఏఈ టూర్ ఉమెన్ 2023 సైక్లింగ్ ఈవెంట్ కోసం ఎమిరేట్‌లోని పలు రహదారులను మూసివేస్తున్నట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పలు కీలక రహదారులలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు RTA ట్విట్టర్‌లో పేర్కొంది. వాహనదారులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని కోరారు.  

రేసు యొక్క 1వ దశ దుబాయ్‌లో ఫ్లాగ్ ఆఫ్ చేయబడుతుందని, పోర్ట్ రషీద్ నుండి ప్రారంభమై నగరం దాటుతుందని తెలిపింది. యూఏఈ టూర్ క్లాసిక్ స్థానాలైన రస్ అల్ ఖోర్, మైదాన్ రేస్‌కోర్స్, ఉమ్ సుఖీమ్, దుబాయ్ స్పోర్ట్స్ సిటీల ద్వారా పామ్ జుమేరా బేస్, దుబాయ్ హార్బర్‌కు చేరుకుంటుంది. రేసు సమయంలో సైక్లిస్టులు ప్రయాణిస్తున్నప్పుడు నిర్దిష్ట ట్రాఫిక్ జంక్షన్ల వద్ద 10-15 నిమిషాల పాటు ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఆర్టీఏ తెలిపింది.  ఈ ఆంక్షలు ఫిబ్రవరి 9 నుండి 12 వరకు అమల్లో ఉంటుందన్నారు.

యూఏఈ జట్టు ADQ

సఫియా అల్సాయెగ్ (యుఎఇ), అలెనా అమియాలియుసిక్ (బెలారస్), ఒలివియా బారిల్ (కెనడా), మార్తా బాస్టియానెల్లి (ఇటలీ), సోఫియా బెర్టిజోలో (ఇటలీ), యూజీనియా బుజాక్ (స్లోవేనియా), చియారా కాన్సోని (ఇటలీ), ఎలియోనోరా గాస్‌పర్రిని (ఇటలీ), (న్యూజిలాండ్), ఎలిజబెత్ హోల్డెన్ (గ్రేట్ బ్రిటన్), అలెనా ఇవాంచెంకో (రష్యా), కరోలినా కుమీగా (పోలాండ్), ఎరికా మాగ్నాల్డి (ఇటలీ), సిల్వియా పెర్సికో (ఇటలీ), లారా తోమాసి (ఇటలీ), అన్నా ట్రెవిసి (ఇటలీ).

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com