ఉదయాన్నే పొట్ట పట్టేసినట్లుందా.?
- February 09, 2023మలబద్ధకం కారణంగా కావచ్చు.. మరే ఇతర కారణాల వల్లనైనా కావచ్చు.. ఉదయాన్నే లేచిన వెంటనే పొట్ట పట్టేసినట్లుగా వుంటే, ఈ తరహా పానీయాలు ట్రై చేయమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సమస్య సాధారణమైనదే అయినప్పటికీ ఒకింత అసౌలభ్యంగా వుండే ఈ సమస్యను చిన్న చిన్న చిట్కాల ద్వారా ఈజీగా ఉపశమనం పొందొచ్చు. అవేంటో తెలుసుకుందాం.
నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా వుంటుంది. అందుకే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుండే పండు నిమ్మపండు. నిమ్మపండు రసాన్ని ఓ గ్లాసుడు సాల్ట్ కలిపిన వాటర్‌లో వేసి తీసుకోవడం వల్ల ట్యాక్సిన్లు రిలీజై పొట్ట శుభ్రం అవుతుంది.
పాలను సహజంగా టీ రూపంలోనో, కాఫీ రూపంలోనో తీసుకుంటుంటాం వుదయాన్నే. అలా కాకుండా, పాలతో కాస్త నెయ్యి కలిపి తీసుకుంటే, ఉదయం అసౌకర్యం నుంచి ఉపశమనం పొందొచ్చునట. ఇలా రాత్రి పూట చేయడం వల్ల ఉదయానికి మరింత ఫలితం వుంటుందని చెబుతున్నారు. మలబద్ధకానికి ఇది దివ్యౌషధంగా చెబుతున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ