ఈ సారి ధనుష్‌కి వర్కవుట్ అయ్యేలానే వుందిగా.!

- February 09, 2023 , by Maagulf
ఈ సారి ధనుష్‌కి వర్కవుట్ అయ్యేలానే వుందిగా.!

తమిళ హీరో ధనుష్ తెలుగులో చేస్తున్న సినిమా ‘సార్’. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాని తెరకెక్కించాడు. వచ్చే వారం అనగా ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా సినిమాని తెలుగులో బాగా ప్రమోట్ చేస్తున్నారు. వెరీ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ కాన్సెప్టులో రూపొందుతోన్న ఈ సినిమా మంచి ఫలితాన్నే ఇచ్చేలా వుంది అటు ధనుష్‌కీ, ఇటు డైరెక్టర్ వెంకీకి. 
కాగా, ఈ సినిమాలో ‘భీమ్లా నాయక్’ బ్యూటీ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్లలో సంయుక్తా మీనన్ చాలా యాక్టివ్‌గా కనిపిస్తోంది. తనదైన డిగ్నిటీ, అందంతో తెలుగు ప్రేక్షకుల్ని మళ్లీ మళ్లీ కవ్విస్తోందీ మలయాళ అందగత్తె.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com