రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ..
- February 10, 2023
ముంబై: ముంబై నుంచి రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు ప్రధాని మోదీ. ముంబై – షిర్డీ , ముంబై -షోలాపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ , మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే , డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముంబై నుంచి షిర్డీ వెళ్లే భక్తులు అదే రోజు దర్శనం చేసుకొని తిరిగి రావడానికి ఈ రైలు ఉపయోగపడుతుంది. ముంబై నుంచి షోలాపూర్‌కు ఆరుగంటల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ చేరుకుంటుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో రైల్వే రంగంలో కొత్త విప్లవం వచ్చిందన్నారు ప్రధాని మోదీ. 10వ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు ఆధునిక భారతానికి నిదర్శనమన్నారు.
కాగా, ఇప్పటి వరకు దేశంలో 8 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రాగా, 9వ వందే భారత్ రైలును ముంబై నుంచి సోలాపూర్ మధ్య ప్రారంభిస్తారు. దీని ద్వారా ముం-సోలాపూర్ మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. అలాగే 10వ వందే భారత్ రైలు ముంబై-సాయినగర్ షిరిడీ రూట్‌లో ప్రారంభం కానుంది. ముంబై-సోలాపూర్ మధ్య నడిచే రైలు సోలాపూర్‌లోని సిద్ధేశ్వర్ వచ్చే ప్రయాణికులు అక్కల్‌కోట్, తుల్జాపూర్, పండరిపూర్, అలండి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. ఇక ముంబ- షిరిడీ వెళ్లే ప్రయాణికులు నాసిక్, త్రయంబకేశ్వర్, సాయినగర్ షిరిడీ, శనిశిగ్నాపూర్ వెళ్లేవారికి ఈ సేవలు అందుకోవచ్చు. అయితే మహారాష్ట్రలో ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి ఉండగా, తాజాగా మరో రెండు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
వందే భారత్ నడిచే సమయం:
ఈ వందే భారత్ రైలు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్‌లో మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభం అవుతాయి. ముంబై-సోలాపూర్ రైలు 400 కిలోమీటర్ల దూరానికి కేవలం 6.35 గంటల్లో చేరుకోవచ్చు.
ఇక ముంబై- షిరిడీ మధ్య 340 కిలోమీటర్లు. ఈ దూరాన్ని చేరుకోవాలంటే 5.24 గంటల సమయం పడుతుంది. అయితే త్వరలో మరిన్ని రూట్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్- తిరుపతి, సికింద్రాబాద్-బెంగళూరు, సికింద్రాబాద్-పూణె రూట్లలో వందే భారత్ రైళ్లు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







