శ్రీవారి భక్తులకు శుభవార్త...
- February 10, 2023
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ కోటా టికెట్లను ఈనెల 13న విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు భక్తులకు ఈ టికెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 22 నుంచి 28 వరకు విడుదల చేయని రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను సోమవారం విడుదల చేయనుంది. మరోవైపు.. మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల ఈనెల 23 నుంచి 28 వరకు విడుదల చేయని కోటాను ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని, టికెట్లు తీసుకుని శ్రీవారి దర్శనం చేసుకోవాలని సూచించింది.
కాగా.. అంగప్రదక్షిణం టికెట్లు కావాల్సిన భక్తులు తిరుమలలో నిర్ణయించిన విధంగా సంప్రాదాయాలు పాటించాల్సి ఉంటుంది. శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత ముందుగా.. టోకెన్ మీద నిర్ణయించిన ఎంట్రీ ద్వారం వద్దకు వెళ్లాలి. స్వామి వారి సుప్రభాత సేవ ప్రారంభమైన తరువాత ముందుగా స్త్రీలను అనుమతిస్తారు. వారి ప్రదక్షణ పూర్తయ్యాక పురుషులను అనుమతిస్తారు. స్వామి వారి బంగారు వాకిలి ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేస్తూ.. అలాగే శ్రీవారి ప్రాకారం చూట్టూ ప్రదక్షిణ చేస్తూ శ్రీవారి హుండీ వరకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







