హైదరాబాద్: ఈ-కార్ రేస్ ప్రారంభంలో ప్రమాదం
- February 10, 2023
హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్ ప్రారంభంలో ప్రమాదం జరిగింది. రేసింగ్ లో టర్నింగ్ వద్ద నేరుగా కారు ఢీకొన్నది. ప్రమాదానికి గురైన కారును క్రేన్ సహాయంతో సిబ్బంది తొలగిస్తోంది. గాయపడ్డ రేసర్ ను మెడికల్ జోన్ కు సిబ్బంది తీసుకెళ్లారు.తిరిగి రేస్ ప్రారంభమైంది. అంతకముందు ఫార్ములా ఈ రేసింగ్ ట్రాక్ మీద గందరగోళం ఏర్పడింది. ఒక్కసారిగా ట్రాక్ మీదకు ప్రజల వాహనాలు వచ్చాయి.
ట్రాక్ మీదకు నార్మల్ వాహనాలు ఎలా వచ్చాయని రేసింగ్ నిర్వాహకులు టెన్షన్ పడుతున్నారు. ట్రాక్ పైకి సాధారణ ప్రజల వాహనాలు అనుమతించిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్ పైకి ప్రజల వాహనాలు రావడంతో మొదటి ప్రాక్టీస్ రేసు ఆలస్యం అవుతోంది.
మరోవైపు ఈ కార్ ప్రాక్టీస్ సెషన్ ను తిలకించేందుకు సెలబ్రిటీల ఆసక్తి చూపుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి, ప్రముఖ బాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రేసింగ్ చూసేందుకు వచ్చారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







