తైఫ్‌లో కారు ప్రమాదం.. ఇద్దరు ఉపాధ్యాయులతో సహా నలుగురు మృతి
- February 10, 2023
తైఫ్: తైఫ్‌కు ఉత్తరాన రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న విషాదకర ఘటన చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులతో సహా రెండు కార్ల డ్రైవర్లు మరణించారు.ఈ ప్రమాదం గురువారం ఉదయం జరిగింది. మృతుల్లో తైఫ్ గవర్నరేట్ నుండి తైఫ్‌కు ఉత్తరాన 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహనీలోని మాధ్యమిక పాఠశాలకు వెళుతున్న ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్ల డ్రైవర్లు కూడా మృతి చెందారు. ట్రాఫిక్ అధికారులు, రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తైఫ్‌లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఫహద్ అల్-షరీఫ్ ప్రమాదంపై ఫాలోఅప్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







