హైదరాబాద్ లో అగ్నిప్రమాదం..3 బస్సులు దగ్ధం
- February 13, 2023
హైదరాబాద్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో పార్కింగ్ చేసిన మూడు బస్సులు దగ్ధమయ్యాయి. కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద భారతీ ట్రావెల్స్‌కు చెందిన మూడు బస్సుల్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పక్కనే ఉన్న బస్సులను అక్కడినుంచి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్‌ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా ఎవరైనా నిప్పుటించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







