8 ఏళ్ల చిన్నారి మెడ నుంచి ఎయిర్ గన్ పెల్లెట్ తొలగింపు

- February 13, 2023 , by Maagulf
8 ఏళ్ల చిన్నారి మెడ నుంచి ఎయిర్ గన్ పెల్లెట్ తొలగింపు

యూఏఈ: 8 ఏళ్ల చిన్నారి మెడ ప్రాంతం నుంచి ఎయిర్ గన్ పెల్లెట్ ను వైద్యులు తొలగించారు. యూసిఫ్ అనే బాలుడు ఒమన్‌లోని తన ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో మరో బాలుడు కాల్చిన ఎయిర్ గన్ పెల్లెట్ అతని మెడకు తగిలింది. కీలకమైన మెడలోని నరాలు, రక్తనాళాల మధ్య అది ఉండటంతో శస్త్రచికిత్స చేసేందుకు చాలా ఆసుపత్రులు, వైద్యులు నిరాకరించారు. బాలుడి తండ్రి, యాకూబ్ సులైమాన్ వివిధ ఆస్పత్రుల చుట్టు 3 నెలలపాటు తిరగారు. ఈ క్రమంలో ఒమన్‌లో ఉన్న యూఏఈకి చెందిన ఆస్టర్ డిఎమ్ హెల్త్‌కేర్.. అబ్బాయిని భారతదేశంలోని కేరళలోని కొచ్చిలోని ఆస్టర్ మెడ్‌సిటీకి తీసుకెళ్లమని కుటుంబ సభ్యులకు సలహా ఇచ్చింది. ఆస్టర్ మెడ్‌సిటీలో పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ సజన్ కోశి ఇంతకు ముందు ష్రాప్నల్ మాట్లాడుతూ.. "యూసిఫ్ మెడలో పెల్లెట్ అతని శ్వాసనాళం, థైరాయిడ్ గ్రంధికి మిల్లీమీటర్ల దూరంలో చాలా ప్రాణాంతకమైన స్థితిలో ఉంది. ఏ మాత్రం పొరబాటు జరిగినా అతని నాడీ వ్యవస్థ, ధమనులు దెబ్బతింటాయి. ఫలితంగా స్వర సామర్థ్యం కోల్పోవడం, అంతర్గత రక్తస్రావం లేదా మరణం కూడా సంభవించవచ్చు.’’ అని వివరించారు. డాక్టర్ కోశి, డాక్టర్ అబిద్ ఇక్బాల్, కార్డియాక్ సర్జన్ డాక్టర్ సురేష్ నాయర్ బృందం రెండు గంటలపాటు శ్రమించి యూసిఫ్ మెడలోంచి పెల్లెట్ ను విజయవంతంగా బయటకు తీశారు. ఐదు రోజుల్లో బాలుడు కోలుకున్నాడు. యూసిఫ్ గత వారం డిశ్చార్జ్ అయ్యాడు. త్వరలోనే తన దేశానికి వెళ్లేందుకు యూసిఫ్ ప్యామిలీ సిద్ధమవుతున్నది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com