శాంతిని, ఐకమత్యాన్ని ప్రబోధించే రమదాన్: బహ్రెయిన్ యువరాజు
- June 19, 2015
బహ్రెయిన్ యువరాజు, డెప్యుటీ సుప్రీం కమాండర్ మరియు మొదటి డెప్యుటీ ప్రిమియర్ ఐన హిజ్ రాయల్ హైనెస్ - ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, మజ్లిస్ సుప్రీం కౌన్సిల్ ఫర్ ఇస్లామిక్ అఫేర్స్ అధ్యక్షులు - షేక్ అబ్దుల్లా బిన్ ఖలిద్ అల్ ఖలీఫా, రాయల్ కోర్ట్ మినిస్టర్ - షేక్ ఖలిద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, ఇంకా అంతర్గత వ్యవహారాల శాఖామంత్రి -లెఫ్టనెంట్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాలను నిన్న సాయంత్రం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బహ్రెయిన్ ప్రజలకు రమదాన్ నెల ప్రారంభాన్ని పురస్కరించుకొని అభినందిస్తూ, శాంతిని, ఐకమత్యాన్ని నిలిపి ఉంచడంలో ఈ మాస ప్రాముఖ్యాన్ని తెలియజేశారు.బహ్రెయిన్ సమాజంలో ఉత్కృష్టమైన సంస్కృతి, సంప్రదాయాలను నిలిపిఉంచడానికి గట్టి పునాదిగా నిలచిన రమదాన్ మజ్లిస్‌ను ప్రశంసించారు. ఈ పర్యటనలో యువరాజా వారిని షేక్ మొహ్మద్ బిన్ సల్మాన్ అల్ ఖలీఫా అనుసరించారు.
----యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







