ఐఎస్ఎఫ్ బహ్రెయిన్ 2024 లోగో ఆవిష్కరించిన హమద్ అల్ ఖలీఫా
- February 15, 2023
బహ్రెయిన్: ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ISF) - జిమ్నాసైడ్ బహ్రెయిన్ 2024 లోగోను సుప్రీం కౌన్సిల్ మొదటి డిప్యూటీ ప్రెసిడెంట్, జనరల్ స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షుడు, బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా అధికారికంగా ఆవిష్కరించారు. బహ్రెయిన్ రాజ్యంలో నివసిస్తున్న పలువురు సీనియర్ అధికారులు, రాయబారులు, విదేశీ మిషన్ల అధిపతుల సమక్షంలో బహ్రెయిన్ నేషనల్ థియేటర్లో జరిగిన వేడుకలో హమద్ అల్ ఖలీఫా లోగోను ఆవిష్కరించారు. అక్టోబరు 2024లో నిర్వహించే అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహించడానికి రాజ్యం సంసిద్ధంగా ఉందని హమద్ అల్ ఖలీఫా వ్యక్తం చేశారు. హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ యువత, క్రీడా రంగానికి అందించిన ఉదారమైన శ్రద్ధ కారణంగా ఈ ఈవెంట్ సాధ్యమైందని చెప్పారు. స్పోర్టింగ్ క్లబ్‌లు, జాతీయ జట్టుకు మద్దతిచ్చే కొత్త పాఠశాలల ప్రతిభను పెంపొందించడానికి, క్రీడలకు సంబంధించిన లక్ష్యాలను మరింతగా సాధించడానికి ఈ ఈవెంట్ దోహదపడుతుందని హమద్ అల్ ఖలీఫా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్‌ను బహ్రెయిన్ హోస్ట్ చేయడం అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను నిర్వహించడంలో కింగ్డమ్ రికార్డు అద్భుతమైన విజయాలకు పొడిగింపుగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సంబంధిత అధికారులందరి సహకారం, ప్రయత్నాలను హమద్ అల్ ఖలీఫా అభినందించారు. ఐఎస్ఎఫ్ జిమ్నాసైడ్ 2024 ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ ఇషాక్ అబ్దుల్లా ఇషాక్ మాట్లాడుతూ.. బహ్రెయిన్‌లోని అథ్లెట్లు, క్రీడా రంగానికి నిరంతర మద్దతును ప్రశంసించారు. ఇది క్రీడల అభివృద్ధి ప్రయత్నాలకు ప్రేరణగా ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







